కాంగ్రెస్ సర్కార్ అసమర్థత, వ్యవసాయంపై ముందస్తు ప్రణాళికలు లేకపోవడం వల్లే రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు వక్తలు విమర్శించారు.
పంటను కాపాడుకునేందుకు ఎరువు దొరక్క అవస్థలు పడుతున్న రైతులను.. అడ్డగోలుగా పెరిగిన ధరలు మరింత బెంబేలెత్తిస్తున్నాయి. యూరియా కొరతను సాకుగా చూపుతూ ప్రైవేటు వ్యాపారులు కర్షకులను లూటీ చేస్తున్నారు.
జిల్లాలోని రైతాంగం యూ రియా కోసం నిద్రహారాలు మాని ఎరువుల దుకాణాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. నల్లగొండ మండలానికి సంబంధించిన మూడు ఆగ్రో ఏజన్సీస్లకు, ఎన్డీసీఎంఎస్కు మార్క్‌ఫెడ్ నుంచి యూరియా సరఫ�
యూరియా బస్తాల కోసం ఓ వైపు రైతులు రేయింబవళ్లు పడిగాపులు కాస్తుంటే.. చీకటి పడ్డాక.. దొంగ చాటున 50 బస్తాలను మాయం చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్లలో కలకలం రేపింది.
రైతులు అరిగోస పడుతున్నా కాంగ్రెస్‌కు యూరియా ఇచ్చే సోయి లేదని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. కొరత తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో రైతన్నలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా క�
‘ఓ చోట చెప్పులు.. మరోచోట ఆధార్‌కార్డులు.. ఇంకోచోట పట్టాదార్ పాస్‌బుక్కులు.. ఎండ లేదు.. వాన లేదు, పగలు లేదు.. రాత్రి లేదు, తెలంగాణలో ఏ మూలకు వెళ్లినా ఇవే లైన్లు..’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవేదన వ�
రైతుకు యూరియా బస్తాలు ఇవ్వలేని కాంగ్రెస్‌కు పాలించే అర్హత లేదని, తక్షణమే దిగిపోవాలని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
యూరియా కోసం రైతులు అధికారుల కాళ్లు మొక్కిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పీఏసీఎస్, వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట సొసైటీలో చోటుచేసుకున్నది.
రైతన్నలకు యూరియా కొరత లేకుండా చూడాలని జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు బుధవారం హైదరాబాద్‌లో రాష్ట్ర వ్యవసాయ కార్యదర్శి రఘునందన్‌రావును కలిసి విన్నవించారు.
జిల్లాకు వచ్చిన 510 మెట్రిక్ టన్నుల యూరియాను అవసరం ఉన్న రైతులకే పంపిణీ చేయాలని, యూరియా పంపిణీలో ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా చూడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి వ్యవసాయాధికారులను ఆదేశించారు.