హైదరాబా ద్, డిసెంబర్ 13(నమస్తే తెలంగాణ): యాసంగికి అవసరమైన యూరియాను రైతులకు అందుబాటులో ఉంచుతామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటికే డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా కోసం కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు.
శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో 2.48 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల బఫర్ స్టాక్ అందుబాటులో ఉన్నదని, ఈ నిల్వలను డిసెంబర్ ఆఖరినాటికి ఇంకా పెంచాలని అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు. రాష్ట్రానికి డిసెంబర్ నెల యూరియాలో 86 వేల టన్నులు ఇప్పటికే కాకినాడ, కృష్ణపట్నం, విశాఖపట్నం, తుత్తుకుడి, కారైకాల్ పోర్టులకు చేరిందన్నారు.