కాళేశ్వర గంగ మన వ్యవసాయ భూముల వైపు సాగుతున్నది.. మన పంట పొలాల్లో సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. కాళేశ్వర ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలతో సిద్దిపేట జిల్లాలోని చెరువులు, కుంటలను మూడేళ్లుగా నింపుతున్నారు.
ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు సాయంతో పంటల సాగు సంబురంగా సాగుతున్నది. పదోవిడుత రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తుండడంతో యాసంగి పంట పెట్టుబడికి రంది లేకుండాపోయింది.
ఆయకట్టు పరిధిలోని పంటలపై రైతులకు పూర్తి భరోసా వచ్చింది. ఆయకట్టుకు సరిపడా నీటిని విడుదల చేయడంతో పంటలు సునాయాసంగా బయటపడుతాయన్న ధైర్యం రైతుల్లో కనిపిస్తున్నది.
కోయిల్‌సాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టుకూ సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి భరోసా ఇచ్చారు. యాసంగి సీజన్‌కు సాగునీటిని విడుదల చేస్తున్నామని, రైతులు ఆందోళన చెందొద్