న్యూఢిల్లీ: జన్యుమార్పిడి (జీఎం) ఆవాలకు పర్యావరణ అనుమతులపై ఓ వైపు వివాదం కొనసాగుతున్నా.. మరికొన్ని జీఎం పంటలు సిద్ధమయ్యాయి. దేశంలోని వివిధ సంస్థల్లో జన్యుమార్పిడి చేసిన అరటి, రబ్బరు, ఆలుగడ్డలను పరిశోధకులు సిద్ధం చేశారు. జన్యుమార్పిడి ఆలుగడ్డలు ‘కేజే66’పై బయోసేఫ్టీ రిసెర్చ్ లెవెల్ ట్రయల్స్ 1కు సిమ్లాలోని సెంట్రల్ పొటాటో రిసెర్చ్ ఇన్స్టిట్యూట్కు అనుమతి కూడా లభించింది. వీటితోపాటు జీఈ అరటి, జీఈ రబ్బరు పంటల బీఆర్ఎల్ 1 కోసం వినతులు వచ్చాయి. కాగా, జీఎం ఆవాలు డీఎంహెచ్-11కు ఇటీవల పర్యావరణ అనుమతులు లభించాయి. దీనిపై పర్యావరణవేత్తలు ఇప్పటికే ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.