న్యూఢిల్లీ : ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణే రచించిన అముద్రిత పుస్తకం సోషల్ మీడియాలో పంపిణీ కావడంపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సోమవారం ఓ అధికారిక ప్రకటన వెలువడింది.
రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం పొందని పుస్తకం ముద్రణకు నోచుకోలేదని, అలాంటి పుస్తకం ఇప్పుడు రాహుల్ గాంధీ చేతిలోకి ఎలా వచ్చిందని ఇండియా టుడే ప్రశ్నించిన కొన్ని గంటల్లోనే ఈ కేసు నమోదు కావడం గమనార్హం. ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం ముద్రించడానికి అనుమతి లేదని, అలాంటిది ఈ పుస్తకం సోషల్ మీడియాలో వైరల్ కావడాన్ని పరిగణనలోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు.