జగిత్యాల రూరల్, మార్చి 20 : ‘అన్నదాతలు అధైర్యపడొద్దు..వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతంగానికి సర్కారు అండగా ఉంటది’ అని జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావ వసంత భరోసానిచ్చారు. అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట నీటిపాలై రైతులు ఇబ్బందుల్లో ఉంటే, కాంగ్రెస్, బీజేపీలు రాజకీయాలు మాట్లాడుతున్నాయని ఆ రోపించారు. వారికి సాగు గురించి మాట్లాడే నైతిక అర్హతలేదని విమర్శించారు.
బీజేపీ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడడం కాదని, ఫసల్ బీమాపై అవగాహన పెంచుకోవాలని చురకలంటించారు. సోమవారం ఆమె జగిత్యాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ఎప్పటికప్పుడూ పంట నష్టాన్ని తెలుసుకుంటూ అంచానావేయాలని అధికారులకు ఆదేశిస్తున్నారని చెప్పారు. కానీ ఆపత్కాలంలోనూ ప్రతిపక్షాలు సర్కారును బద్నాం చేసేందుకు కుట్రలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఫస ల్ బీమాను ఎందుకు అమలు చేయడంలేదో ఇక్క డి నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్ దూరదృష్టితో రైతుబంధు, బీమా పథకాలను రూపొందించారన్నారు. కాంగ్రెస్ నాయకులు రైతులపై మొసలికన్నీరు కార్చుతున్నారని విమర్శించారు. ఫసల్ బీమా పథకాన్ని రాష్ర్టాల్లో అమలు చేయాలని ఎలాంటి నిబంధనలు లేవని, రైతులకు ఇష్టం ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చన్నా రు. ఈ పథకంలో మండలాన్ని యూనిట్‌గా తీసుకోవడంతో రైతులకు ఒరిగేదేం ఉండదన్నారు. 2013-14లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ పంట నష్టం జరిగిందని, తాటిపెల్లిలో పంట నష్టాన్ని పరిశీలిందుకే వచ్చిన అప్పటి సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చి విస్మరించారని గుర్తు చేశారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ నిండుకుండలా మా రిందని, నాలుగు రెట్ల పంట దిగుబడి పెరిగిందన్నారు. దేశంలోనే రైతాంగానికి న్యాయం చేసిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. ప్రతిపక్ష పా ర్టీలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని, వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీ ఎంపీ అర్వింద్ పసు పు బోర్డు తెస్తానని బాండ్ రాసిచ్చి ఇంతవరకు నెరవేర్చలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఆయనను ఎందుకు ప్రశ్నించడంలేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో ఏఎంసీ అధ్యక్షురాలు నక్కల రాధ, అర్బన్ జడ్పీటీసీ సంగెపు మహేశ్, జగిత్యాల, కల్లెడ పీఏసీఎస్ చైర్మన్లు పత్తిరెడ్డి మహిపాల్ రెడ్డి, జోగిన్‌పెల్లి సందీప్‌రావు, జుంబర్తి శంకర్, హరీశ్ తదిరులు పాల్గొన్నారు.