RAKASA Teaser | నిహారిక కొణిదెల నిర్మాణంలో ‘రాకాస’.. టీజర్‌తో అదరగొట్టిన సంగీత్ శోభన్!
Rakasa Teaser | యువ నటుడు సంగీత్ శోభన్ కథానాయకుడిగా, మానస శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న సరికొత్త ఫాంటసీ కామెడీ డ్రామా ‘రాకాస’ చిత్రానికి సంబంధించిన తాజా అప్డేట్ సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Rakasa Teaser | యువ నటుడు సంగీత్ శోభన్ కథానాయకుడిగా, మానస శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న సరికొత్త ఫాంటసీ కామెడీ డ్రామా ‘రాకాస’ చిత్రానికి సంబంధించిన తాజా అప్డేట్ సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మరియు జీ స్టూడియోస్ బ్యానర్లపై మెగా డాటర్ నిహారిక కొణిదెల అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ‘ఆయ్’ సినిమా ఫేమ్ నయన్ సారిక కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమాకు సంబంధించి ఆదివారం చిత్ర యూనిట్ అధికారికంగా టీజర్‌ను విడుదల చేసింది.
ఈ టీజర్ విభిన్నమైన విజువల్స్ మరియు వినోదభరితమైన అంశాలతో సినిమాపై అంచనాలను పెంచుతోంది. చిత్రంలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తుండటంతో ఈ ఫాంటసీ డ్రామాలో కామెడీ డోస్ భారీగా ఉండబోతోందని అర్థమవుతోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ నిర్మాణానంతర పనులను కూడా సమాంతరంగా పూర్తి చేసుకుంటోంది. వినూత్న కథాంశంతో వస్తున్న ఈ ‘రాకాస’ చిత్రాన్ని వేసవి కానుకగా ఏప్రిల్ 03వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నద్ధమవుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

