శుక్రవారం 23 అక్టోబర్ 2020
Sports - Sep 22, 2020 , 20:17:13

రెచ్చిపోయిన శాంసన్‌..19 బంతుల్లోనే అర్ధశతకం

రెచ్చిపోయిన శాంసన్‌..19 బంతుల్లోనే అర్ధశతకం

షార్జా:  చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ యువ  బ్యాట్స్‌మన్‌‌ సంజూ శాంసన్‌ అదరగొడుతున్నాడు. పేసర్లు, స్పిన్నర్ల బౌలింగ్‌లో అలవోకగా సిక్సర్లు బాదేస్తున్నాడు. ధనాధన్‌ బ్యాటింగ్‌తో కేవలం 19 బంతుల్లోనే ఒక ఫోర్‌, 6 సిక్సర్లతో అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. 

స్పిన్నర్‌ పియూశ్‌ చావ్లా వేసిన 8వ ఓవర్లో ఏకంగా మూడు సిక్సర్లు బాది 21 పరుగులు రాబట్టాడు. మరో ఓపెనర్‌ స్టీవ్‌ స్మిత్‌..శాంసన్‌కు సహకారం అందిస్తున్నాడు. ఆత్మవిశ్వాసంతో ఉన్న శాంసన్‌ రాజస్థాన్‌కు భారీ స్కోరు అందించే దిశగా దూసుకెళ్తున్నాడు. తనదైన మార్క్‌షాట్లతో హిట్టింగ్‌ చేస్తూ ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెతిస్తున్నాడు. సంజూ ధాటికి రాజస్థాన్‌ 8 ఓవర్లలోనే 89 పరుగుల మార్క్‌ను అందుకుంది. 


logo