Barbie Movie | గతేడాది హాలీవుడ్ నుంచి వచ్చిన బ్లాక్ బస్టర్ ‘బార్బీ’ (Barbie). గ్రేటా గెర్విగ్ (Great Gerwig) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లు సాధించింది. ఇప్పటివరకు ఈ సినిమా $1.4 బిలియన్ కలెక్షన్లు సాధించింది. అంటే ఇండియన్ కరెన్సీలు అక్షరాలు రూ.11,000 కోట్లు. ఒక ఫాంటసీ సినిమాకు ఈ రేంజ్లో కలెక్షన్లు రావడం అంటే విషేశం అనే చెప్పాలి. ఇక ఈ సినిమాతో వెయ్యి కోట్ల మార్క్ టచ్ చేసిన తొలి మహిళా దర్శకురాలిగా గ్రెటా సంచలన రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమా చూడాలంటే సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్లు అదనంగా రూ.499 చెల్లించాల్సి ఉంటుంది. అయితే తాజాగా ఈ సినిమా తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది
ప్రముఖ ఓటీటీ వేదిక జియో సినిమాస్ ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం జియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను మీరు చూసి ఎంజాయ్ చేయండి.
#Barbie is now streaming on JioCinema.
Audio: Tamil, Hindi, Telugu, Kannada, English pic.twitter.com/hFimx7KbwB
— Filmy Fanatic (@FanaticFilmy) May 4, 2024