(Covid Compensation) అమరావతి: కొవిడ్ వైరస్ సోకి చనిపోయినవారి కుటుంబాలను ఆదుకునేందుకు ఏపీ సర్కార్ సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే కొవిడ్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ సాయం నేరుగా బాధితులకు అందజేసేందుకు ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆర్థిక సహాయం అందించే ప్రక్రియలో అవకతవకలు జరగకూడదన్న ఉద్దేశంతో ఒక పోర్టల్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను రెవెన్యూ శాఖ విడుదల చేసింది.
కరోనా వైరస్ సోకి ప్రాణాలు విడిచిన వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 వేల ఆర్థిక సాయంతో ఆదుకుంటున్నది. ఈ సాయం బాధిత కుటుంబాలకు సక్రమంగా అందేందుకు ప్రభుత్వం పోర్టల్‌నే తీసుకొచ్చింది. covid19.ap.gov.in/exgratia అనే పోర్టల్‌లో బాధిత కుటుంబాలు ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులో మృతుడికి కరోనా సోకినట్లుగా తెలిపే ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటిజెన్ లేదా మాలిక్యులర్ టెస్ట్ రిపోర్టుల్లో ఏదో ఒక డాక్యుమెంట్‌ను అప్ లోడ్ చేయాలి. అధికారులు దరఖాస్తులను పరిశీలించిన మీదట బాధిత కుటుంబం ఇచ్చిన బ్యాంకు ఖాతాలో డబ్బు జమచేస్తారు.
అధిక బరువుతో విసిగిపోయారా.. అయితే ఈ పండ్లు తినండి..!
కొవిడ్ వైరస్ చేరిందో.. ఈ మాస్క్ మెరుస్తుంది! కనిపెట్టిన జపాన్ శాస్త్రవేత్తలు
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..