కన్నడనాట సుప్రీమ్స్టార్గా పేరుతెచ్చుకున్న భార్గవ్ హీరోగా పరిచయమవుతూ దర్శకత్వం వహిస్తున్న ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’ చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. బండి నాగరాజు నిర్మాత. మీనాక్షి జైస్వాల్, అరియా మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు క్లాప్‌నివ్వగా, కె.అశోక్ కుమార్ కెమెరా స్విఛాన్ చేశారు. ఈ సినిమా ద్వారా తెలుగులో తన కెరీర్ మొదలుపెట్టడం ఆనందంగా ఉందని, ఇదో ఆహ్లాదభరితమైన ప్రేమకథా చిత్రమని హీరో, దర్శకుడు భార్గవ్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సాయికృష్ణ, సంగీతం: పెద్దపల్లి రోహిత్, స్క్రిప్ట్, దర్శకత్వం: భార్గవ్ బి.వి.