ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అమీర్ లోగ్’. రమణారెడ్డి సోమ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాధవి రెడ్డి సోమ నిర్మాత. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సంస్థ ఈ చిత్రాన్ని ఈ నెల 21న విడుదల చేస్తున్నది. గురువారం ట్రైలర్ను విడుదల చేశారు. దర్శకుడు రమణారెడ్డి చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘హైదరాబాదీ వైబ్ ఉన్న సినిమా ఇది. ఇక్కడ ప్రజల జీవితానికి ప్రతీకలా ఉంటుంది.
ఈ కథలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. హైదరాబాదీ నేటివిటీ అందరిని మెప్పిస్తుంది’ అన్నారు. బస్తీలో పుట్టి పెరిగిన తాను..ఓ బస్తీ కథతో తయారైన సినిమాలో నటించడం ఆనందంగా ఉందని హీరో ఎంసీ హరి పేర్కొన్నారు. వేద జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: స్మరణ్సాయి, దర్శకత్వం: రమణా రెడ్డి సోమ.