కేబీఆర్ చుట్టూ వన్ వే
నగరంలో అత్యంత రద్దీగా ఉండే కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 18వ తేదీ ఉదయం 6 గంటల నుంచి కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు.
- 18 నుంచి మారనున్న ట్రాఫిక్ రూల్స్
- గేటు వద్ద సూచనల కోసం క్యూఆర్ కోడ్
- ఆ ప్రాంతంలో రాంగ్రూట్లో వెళ్తే కష్టమే
- హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్
సిటీబ్యూరో, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): నగరంలో అత్యంత రద్దీగా ఉండే కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 18వ తేదీ ఉదయం 6 గంటల నుంచి కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. దాదాపు 18 నెలల పాటు ఈ ట్రాఫిక్ విధానం అమల్లో ఉంటుందని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. కేబీఆర్ పార్క్ వద్ద వన్‌వే ముందస్తు ఏర్పాట్లలో భాగంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం వాకర్లు, స్థానిక ఆసుపత్రులు, వ్యాపార సంస్థల ప్రతినిధులు, ఇతర నిపుణులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
నూతన ట్రాఫిక్ మార్పులతో ఆసుపత్రులకు వచ్చే అత్యవసర అంబులెన్సులు, రోగులు, ఆసుపత్రి సిబ్బంది, వ్యాపారసంస్థల వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులను జోయల్ డేవిస్ ఆదేశించారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో ఉత్పన్నమయ్యే సమస్యలపై ప్రతినిధుల నుంచి సూచనలు స్వీకరించారు. నూతన నిబంధనలు విజయవంతం కావడానికి వాహనదారులు, స్థానికంగా ఉండే సంస్థల పూర్తి సహకారం అవసరమని ఆయన చెప్పారు. వాకర్లు, వాహనదారులు తమ వాహనాలను పార్కింగ్ స్థలాల్లో, మల్టీలెవల్ పార్కింగ్ సదుపాయంలో మాత్రమే నిలపాలని తెలిపారు. ఉదయం వేళల్లో రోడ్డుకు ఎదురుగా రాంగ్రూట్లో వాహనాలు నడపకూడదని, పోలీసులు సవరించిన ట్రాఫిక్ మార్గదర్శకాలను పాటిస్తూ అక్కడి ట్రాఫిక్ సిబ్బందికి పూర్తిస్థాయిలో సహకరించాలని చెప్పారు.
ప్రయాణికులు ముందస్తుగా తమ మార్గాలను ప్రణాళిక చేసుకోవాలని, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో సురక్షితమైన, క్రమబద్ధమైన ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రజలు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. కేబీఆర్ పార్క్ సర్కిల్ వద్ద నిరంతరం ఎదురవుతున్న ట్రాఫిక్ జామ్‌లను తగ్గించడం, రోడ్డు ప్రమాదాలను నివారించడం, వాహనాల రాకపోకలను క్రమబద్దీకరించడమే ఈ వన్‌వే అమలు ముఖ్య ఉద్దేశ్యమని అధికారులు వివరించారు. ఈ మార్పులు అమలులోకి వచ్చిన తర్వాత పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా అవసరమైన మార్పులు చేస్తామని జాయింట్ కమిషనర్ తెలిపారు. ఇందుకు సంబంధించి పార్క్ వద్ద సలహాలు, సూచనలను స్వీకరించేందుకు పార్క్ ముందు క్యూఆర్ కోడ్‌ను అందుబాటులో ఉంచుతామని ఆయన చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

