శర్వానంద్ జార్జ్ క్రిష్ ప్రారంభం
శర్వానంద్ కథానాయకుడిగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జార్జ్ క్రిష్' చిత్రం ప్రారంభోత్సవం శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ని, విడుదల తేదీని ప్రకటిస్తూ ఓ కలర్‌ఫుల్ పోస్టర్ని కూడా ఈ సందర్భంలోనే చిత్రబృందం విడుదల చేసింది.
శర్వానంద్ కథానాయకుడిగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జార్జ్ క్రిష్’ చిత్రం ప్రారంభోత్సవం శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ని, విడుదల తేదీని ప్రకటిస్తూ ఓ కలర్‌ఫుల్ పోస్టర్ని కూడా ఈ సందర్భంలోనే చిత్రబృందం విడుదల చేసింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ‘జార్జ్ క్రిష్’ చిత్రం విడుదల కానున్నదని ప్రారంభోత్సవం రోజే మేకర్స్ ప్రకటించడం విశేషం. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర నిర్మాత సురేశ్‌బాబు కెమెరా స్విచాన్ చేయగా, బీఆర్ఎస్ నాయకుడు, శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లాప్ కొట్టారు.
చిత్ర దర్శకుడు శ్రీనువైట్ల తొలిషాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ నెల 28 నుంచి నాన్‌స్టాప్ షూటింగ్ ఉంటుందని, వచ్చే ఏడాది జనవరి 14న సినిమాను విడుదలచేస్తామని, ఈ కథపై చిత్రబృందమంతా నమ్మకంతో ఉన్నామని చిత్ర దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి రచన: నందు సవిరిగాన, గోపీ మోహన్, కెమెరా: కె.వి.గుహన్, సంగీతం: అనూప్ రూబెన్స్, సహ నిర్మాత: అజయ్ సుంకర, సమర్పణ: ఏటీవీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

