(Jagan Review) అమరావతి: రైతులకు కనీస మద్ధతు ధర వచ్చేలా చూడాలని ఆయన అధికారులకు సూచించారు. రైతులకు సేవ చేయడంలో నిర్లక్ష్యం వహించవద్దని దిశానిర్దేశం చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లపై ఆహార, పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖల అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. పంటల సేకరణలో ఆర్బీకేలు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చూడటం వల్ల రైతులకు మరింత మేలు చేసిన వారం అవుతామని చెప్పారు. రైతులందరికీ ఎంఎస్పీ రావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం సూచించిన విధంగానే ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేకంగా చర్చించారు. ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని, ఇందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు
ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లపై అన్నదాతలకు ప్రతి సమాచారం అందేలా చూడాలని, రైతులతో సమన్వయం చేసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. రంగు ధాన్యం, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు గతంలో ఎవరూ ముందుకు వచ్చిన సందర్భాలు లేవని అన్నారు. రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేయడంలో మిల్లర్ల పాత్ర ఉండకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ధాన్యం నాణ్యత పరిశీలనలో రైతులు మోసపోకుండా చూడాలని మార్కెటింగ్ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. ప్రతి ఆర్బీకేలో కనీసం ఐదుగురు సిబ్బందిని నియమించి ధాన్యం, పంటల కొనుగోలుకు ఒక టెక్నికల్ అసిస్టెంట్, డాటా ఎంట్రీ ఆపరేటర్, మిగతా ముగ్గురు సిబ్బంది కచ్చితంగా ఉండాలని వైఎస్ జగన్ సూచించారు.
అధిక బరువుతో విసిగిపోయారా.. అయితే ఈ పండ్లు తినండి..!
కొవిడ్ వైరస్ చేరిందో.. ఈ మాస్క్ మెరుస్తుంది! కనిపెట్టిన జపాన్ శాస్త్రవేత్తలు
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..