(IMA NATCON) తిరుపతి: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ)కి చెందిన అకాడమీ ఆఫ్ మెడికల్ స్పెషాలిటీస్ (ఏఎంఎస్) ‘ఐఎంఏ ఏఎంఎస్ నాటాన్ 2021’ వార్షిక జాతీయ సదస్సును తిరుపతిలో నిర్వహిస్తున్నారు. ఈ సదస్సు ఇవాల్టి నుంచి రెండు రోజుల పాటు జరుగనున్నది. ఈ సదస్సుకు దాదాపు 500 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు, సూపర్ స్పెషలిస్టులు ఫిజికల్‌గా, వర్చువల్‌గా పాల్గొంటారని సదస్సు చైర్మన్ డాక్టర్ డీ శ్రీహరి రావు, ఐఎంఏ ఏఎంఎస్ ఏపీ స్టేట్ చైర్ పర్సన్ డాక్టర్ పీ కృష్ణ ప్రశాంతి, ఐఎంఎ సైంటిఫిక్ కోఆర్డినేటర్ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం తెలిపారు.
ఈ సదస్సులో ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జయలాల్, ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ సహజానంద్ ప్రసాద్ సింగ్, సెక్రటరీ డాక్టర్ జయేష్ ఎం లేలే, డాక్టర్ సంజీవ్ సింగ్ యాదవ్, డాక్టర్ కేతన్ దేశాయ్, డాక్టర్ సమరం, డాక్టర్ రాజన్ శర్మ, డాక్టర్ వేద ప్రకాష్ మిశ్రా, ఐఎంఏ తిరుపతి శాఖాధిపతులు పాల్గొంటారు. తిరుపతి వేదికగా తొలిసారిగా అకడమిక్ సెషన్, పాలక మండలి సమావేశం, కీలకోపన్యాసం తదితర కార్యక్రమాలు జరుగనున్నాయి.
అధిక బరువుతో విసిగిపోయారా.. అయితే ఈ పండ్లు తినండి..!
కొవిడ్ వైరస్ చేరిందో.. ఈ మాస్క్ మెరుస్తుంది! కనిపెట్టిన జపాన్ శాస్త్రవేత్తలు
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..