(Ganjai Gang arrest) గుంటూరు: విద్యార్థులే లక్ష్యంగా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఆరుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.10 లక్షల విలువైన గంజాయి, రూ.1.50 లక్షలు విలువచేసే లిక్విడ్ గంజాయి, 3 కార్లు, 5 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాలను గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆదివారం మీడియాకు వెల్లడించారు.
గుంటూరు జిల్లాలో ఇటీవలి కాలంలో గంజాయి సరఫరా ఎక్కువైంది. కాలేజీల విద్యార్థులను టార్గెట్‌గా ఎంచుకుని గంజాయిని స్మగ్లింగ్ చేయడంపై కొన్ని ముఠాలు దృష్టిసారించాయి. గుంటూరు నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా స్మగ్లింగ్ చేస్తున్నారు. దీనిపై గత కొద్ది కాలంగా అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఠా మూలాలను కనుక్కోవాలని అదికారులను ఆదేశించారు. సిద్దాబత్తుల వినయ్, కుర్రా వెంకటేష్ అనే వ్యక్తులు విశాఖ జిల్లా పాడేరులో గంజాయిని కొనుగోలు చేసి కార్లలో గుంటూరుకు తరలిస్తారు. ఇక్కడి నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు, పొరుగు రాష్టాలకు అబూబకర్ చేరవేస్తూ ఉంటాడు. అబూబకర్ నుంచి ఇసాక్ వామన్, మహమ్మద్ ఇషాన్ కొనుగోలు చేసి కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో విక్రయిస్తుంటారు. కాగా, గుంటూరు బైపాస్ రోడ్డు వద్ద కార్లలో గంజాయిని మారుస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వీరి నుంచి 10 లక్షల విలువచేసే గంజాయి, లిక్విడ్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 3 కార్లను సీజ్ చేశారు. ముఠా సభ్యులను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు.
చర్మ క్యాన్సర్ ఎందుకు వస్తుందో కారణం తెలిసిపోయింది!
సోరియాసిస్ బాధితులకు గుడ్‌న్యూస్.. శాశ్వత పరిష్కారం దొరికినట్టే
నొప్పి లేని, మచ్చ రాని వీనోట్స్ సర్జరీ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..