షార్ట్‌సర్యూట్‌తో డ్రిప్ పైపుల ఫ్యాక్టరీ దగ్ధం
షార్ట్‌సర్యూట్‌తో డ్రిప్ పైపుల ఫ్యాక్టరీ దగ్ధమైన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలోని అయిజ పట్టణం రాయిచూర్ రోడ్డులో శనివారం చోటు చేసుకున్నది. ఉదయం 9గంటలకు నిప్పురవ్వలతో రగులుకున్న మంటలు పరమేశ్వర ఇండస్ట్రియల్ డ్రిప్ పైపుల ఫ్యాక్టరీలో నిల్వ ఉంచిన 12 వేల పైపుల బండిల్స్‌కు వ్యాపించడంతో ఫ్యాక్టరీ మొత్తం దగ్ధమైంది. విషయం తెలుసుకున్న ఎస్సైలు శ్రీనివాసరావు, కిరణ్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని ప్రజలను అటువైపు వెళ్లకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
- 4గంటలపాటు శ్రమించి మంటలు అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది
- పరిశీలించిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు
అయిజ, ఫిబ్రవరి 21 : షార్ట్‌సర్యూట్‌తో డ్రిప్ పైపుల ఫ్యాక్టరీ దగ్ధమైన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలోని అయిజ పట్టణం రాయిచూర్ రోడ్డులో శనివారం చోటు చేసుకున్నది. ఉదయం 9గంటలకు నిప్పురవ్వలతో రగులుకున్న మంటలు పరమేశ్వర ఇండస్ట్రియల్ డ్రిప్ పైపుల ఫ్యాక్టరీలో నిల్వ ఉంచిన 12 వేల పైపుల బండిల్స్‌కు వ్యాపించడంతో ఫ్యాక్టరీ మొత్తం దగ్ధమైంది. విషయం తెలుసుకున్న ఎస్సైలు శ్రీనివాసరావు, కిరణ్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని ప్రజలను అటువైపు వెళ్లకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. 10:30గంటలకు అగ్నిమాపక ఎస్సై రాకేశ్ ఆధ్వర్యంలో నాలుగు వాహనాలు, సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోలేదు. 4గంటలపాటు శ్రమించి మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
అంతలోపే జరగాల్సిన నష్టం పూ ర్తిగా జరిగింది. రెండు కిలోమీటర్ల వరకు పొగ కమ్ముకున్నది. ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయని తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ సీఎం సురేశ్, వైస్ చైర్మన్ నర్సింహులు ఫ్యాక్టరీ వద్దకు చేరుకొని మంటలు ఆర్పేందుకు అవసరమైన ఏర్పాట్లను చూశారు. సకాలంలో అగ్నిమాపక వాహనం, సిబ్బంది చేరుకుంటే నష్టం తగ్గేదని చైర్మన్, వైస్ చైర్మన్ పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా అయిజ పట్టణంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అయిజ పట్టణంలో అగ్నిమాక కేంద్రం ఏర్పాటు చేసి, అగ్నిప్రమాదాల నుంచి ఉపశమనం కలిగించాలని ఆయన డిమాండ్ చేశారు.డ్రిప్ పైపుల ఫ్యాక్టరీని శాంతినగర్ సీఐ టాటాబాబు పరిశీలించి అగ్నిప్రమాదంపై యజమాని ప్రతాప్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఆయన తెలిపారు.
రూ. 6కోట్ల మేర నష్టం
ఫ్యాక్టరీ దగ్ధమైన ఘటనలో రూ. 6కోట్ల మేర నష్టం వాటిల్లిందని బాధితుడు భూంపురం ప్రతాప్‌రెడ్డి తెలిపారు. 12 వేల డ్రిప్ పైపుల బండి ల్స్, 5టన్నుల మొక్కజొన్న, పైపుల తయారీకి ఉపయోగించే పదా ర్థం, మోటార్లు, ప్యానల్ బోర్డులు, ఇతర మెటీరియల్, ఫ్యాక్టరీ ని ర్మాణంతో సహా పూర్తిగా దగ్ధమైందని బాధితుడు వాపోయారు. ప్రభు త్వం ఫ్యాక్టరీ నిర్మాణం కోసం చేసిన వ్యయాన్ని భరించాలని బాధితుడు కోరారు.
అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పరిశీలన
అయిజ పట్టణంలో అగ్నిప్రమాదానికి గురైన పరమేశ్వర ఇండస్ట్రీయల్ డ్రిప్ పైపుల ఫ్యాక్టరీని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పరిశీలించారు. శాంతినగర్ సీఐ టాటాబాబు కలిసి అగ్నిప్రమాదానికి గల కారణాలను యజమాని అడిగి తెలుసుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టంపై ఆరా తీశారు. ఫ్యాక్టరీకి ప్రభుత్వం ద్వారా అవసరమైన సహాయ, సహకారాలను అందిస్తామని బాధితుడికి ధైర్యం చెప్పారు. అయిజ పట్టణంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వంతో చర్చించి ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వెల్లడించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

