(Vishaka Cows) విశాఖపట్నం వెంకోజీ పాలెంలోని జ్ఞానానంద ఆశ్రమంలో గోవుల మృత్యుఘోష కొనసాగుతూనే ఉన్నది. ఆదివారం మరో నాలుగు ఆవులు చనిపోయాయి. ఇప్పటి వరకు ఈ ఆశ్రమంలో 25 గోవులు మృతిచెందాయి. మరికొన్ని తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా తెలుస్తున్నది. అక్రమంగా రవాణా చేసేందుకు కంటైనర్లలో కుక్కేయడంతో మూగజీవాలు గాయపడ్డాయి. గాయపడిన గోవులకు పశుసంవర్ధకశాఖ వైద్యం అందిస్తున్నది. గోవుల మరణాలపై రాజకీయ పార్టీల నేతలు స్పందించి, గోశాలలను సందర్శిస్తున్నారు. సరైన ఆహారం, నీరు లేకపోవడం వల్లే సమస్యలు వచ్చాయని అధికారులు చెప్తున్నారు. ఇవాళ మరో నాలుగు అవులు చనిపోవడం విషాదం నింపింది.
కాగా, జ్ఞానానంద ఆశ్రమం గోశాలలో గోవులు చనిపోతున్న వైనంపై సాధు పరిషత్తు స్పందించింది. వీటి సంరక్షణ బాధ్యత ప్రభుత్వంపైనే ఉన్నదని, వెంటనే సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర సాధుపరిషత్తు అధ్యక్షులు శ్రీనివాసనంద సరస్వతి డిమాండ్ చేశారు. గోశాలలో ఆవుల దీన పరిస్థితిని ఆయన పరిశీలించారు. ఇప్పటికే చాలా ఆవులు మృత్యువాత పడ్డాయని మిగిలినవి చనిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ఇలాఉండగా, శ్రీకాకుళం నుంచి హైదరాబాద్కి అక్రమంగా తరలివస్తున్న 160 గోవులను పట్టుకుని తమ ఆశ్రమంలో అధికారులు వదిలేసి వెళ్లారని నిర్వాహకులు తెలిపారు. ఇక్కడ 20 ఆవులకే నివాసం ఉన్నదని, నాలుగు రోజుల క్రితం 160 గోవులను లారీల్లో తీసుకొచ్చి వదిలేశారని వారు చెప్పారు. తమకు సమాచారం ఇవ్వకుండానే పోలీసులు ఆశ్రమంలో వదిలేసి వెళ్లిపోయారని గోసేవ నిర్వాహకులు చెప్తున్నారు.
అధిక బరువుతో విసిగిపోయారా.. అయితే ఈ పండ్లు తినండి..!
కొవిడ్ వైరస్ చేరిందో.. ఈ మాస్క్ మెరుస్తుంది! కనిపెట్టిన జపాన్ శాస్త్రవేత్తలు
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..