శివనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాములను 35వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ పంపిణీ చేశారు.
కాజీపేట పట్టణంలో ప్రధాన రోడ్డుకు పక్కల ఉన్న చెట్ల కొమ్మలను గత మూడు, నాలుగు రోజుల క్రితం నరికి రోడ్డుపై పడేయడంతో వాహన దారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు.
ఆర్థిక భారం భరించలేమంటూ గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జీపీ ట్రాక్టర్లకు మండలంలోని పంచాయతీ కార్యదర్శులు తాళాలు వేసి ఎంపీఓ ప్రసాద్ అప్పగించారు.
రైతులు ఎరువుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క వానకాలం సీజన్లో విత్తనాలు విత్తు కోవడం ప్రారంభం కావడంతో ఎరువులు అవసరమైన రైతులు దుకాణాల చుట్టు యూరియా, డీఏపీ మందుల కోసం పాకులాడుతున్నారు.
స్కూల్ బస్సుల పై మేడ్చల్ ఆర్టీఏ అధికారులు కొరడా ఝళిపించారు. వేసవి సెలవుల అనంతరం గురువారం పునః ప్రారంభం కావడంతో స్కూల్ బస్సుల పై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి తనిఖీలు చేపట్టారు.
Seeds | విత్తనాలు అమ్మే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏడీఏ నూతన్ కుమార్ అన్నారు. గురువారం మనూర్ రైతు వేదికలో ఫర్టి లైజర్ నిర్వాహకులకు సమావేశం నిర్వహించారు.