కందుకూరు, 1 : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని కందుకూరు డివిజన్ ఆర్డిఓ జగదీశ్వర్‌రెడ్డి పరివీలించారు. డివిజన్ పరిధిలోని కందుకూరు, మహేశ్వరం, తలకొండపల్లి, ఆమనగల్లు, కడ్తాల్మండలాల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నిలను కౌటింగ్ నిర్వహించడానికి ప్రతి మండలానికి అనుకూలంగా ఉండే మహేశ్వరం గేటు సమీపంలోని బీసీ వెల్పెర్ రెసిడెన్షియల్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ప్రతి మండలానికి అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 23వ తేది ఎన్నికలను నిర్వహించగా నవంబర్ 11వ తేదిన కౌంటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలు జరిగిన నాటి నుంచి ఫలితాలు వెలువడే వరకు పోలింగ్ బాక్స్‌లు భద్రంగా ఉంచుతామని తెలిపారు. ఆయన వెంట నాయబ్ తహసీల్దారు శేఖర్‌తో, తదితరులు ఉన్నారు.