భోపాల్ : శతాబ్దం క్రితం తన తాత ఇచ్చిన అప్పును తీర్చాలంటూ మధ్యప్రదేశ్‌కు చెందిన 63 ఏండ్ల వికేక్ రుథియా అనే వ్యక్తి బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. తన తాత సేథ్ జుమ్మా లాల్ రుథియా మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో 1917లో బ్రిటిష్ ప్రభుత్వానికి రాజకీయ ఏజెంట్ డబ్ల్యూస్ దావిస్ ద్వారా రూ.35,000ను రుణంగా ఇచ్చాడని వివేక్ తెలిపాడు. అయితే 1947లో భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వారు దేశాన్ని వదిలివెళ్లిపోవడంతో ఆ బాకీ అలానే ఉండిపోయిందన్నారు.
అప్పు గురించి తన తండ్రి పట్టించుకోలేదని, అయితే తాను దానిని వదలదల్చుకోలేదన్నారు. ఇటీవల తన తాత ఇచ్చిన రుణానికి సంబంధించిన పత్రాలు కూడా లభ్యమయ్యాయన్నారు. దీంతో ఆ మొత్తాన్ని ప్రభుత్వం నుంచి వడ్డీతో సహా వసూలు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. 5.5% వార్షిక వడ్డీ చూసుకున్నా అసలు, వడ్డీ కలిపి కొన్ని కోట్ల రూపాయలు అవుతుందని చెప్పారు.