హిమాయత్‌నగర్,అక్టోబర్1: హమాస్ సంస్థ చర్యలను అడ్డం పెట్టుకుని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గాజాను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వీ.ఎస్.బోస్ అన్నారు. బుధవారం హిమాయత్‌నగర్‌లోని ఎస్ ఎన్ రెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలస్తీనాకు పరిష్కారం చూపకుండా ట్రంప్ ఎలాంటి ప్రతిపాదన చేసినా ఫలితం ఉండదన్నారు.
ట్రంప్ ఒక నియంత, మరో నియంత నెతన్యాహుతో కలిసి గాజాను ఆక్రమించుకునేందుకు కుట్ర చేయడం దుర్మార్గమన్నారు. పాలస్తీ నా ప్రజలకు స్వతంత్ర దేశం కావాలని సమాజం కోరుకుంటుందని తెలిపారు. ట్రంప్ ఇప్పటికైనా తన కుట్రలు మానుకొని గాజాలో శాంతి కోసం కృషి చేయాలని లేనిపక్షంలో చరిత్రలో ట్రంప్ నియంతలా మిగిలిపోతారని హెచ్చరించారు.