రాయపోల్ : ఆధ్యాత్మిక చింతన, భక్తి ప్రబోధం, సంప్రదాయ పరిరక్షణ లక్ష్యాలతో సద్గురు లింగప్ప స్వామి, లింగయ్య స్వామిజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాపాద యాత్ర ( Maha Padayatra ) గురువారం సిద్దిపేట జిల్లా రాయపోల్కు చేరుకుంది.
యాత్రలో నాగభూషణ్ స్వామి (దామరచెర్ల), రాజా మహారాజ్ (కర్ణాటక), సంతేశ్ మహారాజ్ (గుంటకల్), అల్ల మహారాజ్ (అమరావతి), చంద్రశేఖర్ స్వామి (పాములపల్లి), రామస్వామి (బెంగళూరు విద్యార్థి) , వీరభద్ర స్వామి పాల్గొన్నారు.
ఈనెల 20న ప్రారంభమైన పాదయాత్ర మార్చి 1న ముగిస్తుందని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని కోరారు.ఈ మహా పాదయాత్రకు రాయపోల్ మండల కేంద్రంలో భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతం జీఎల్ ఆర్ ఫంక్షన్ హాల్లో స్వాములను సన్మానించారు.