న్యూఢిల్లీ, జూలై 28 : మౌలిక సదుపాయాల సంస్థ లార్సెన్ అండ్ టుబ్రో ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.4,122.85 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. కిందటేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.3,617.19 కోట్ల లాభంతో పోలిస్తే 14 శాతం వృద్ధిని కనబరిచింది.
భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, వాణిజ్య అంతరాయాలు ఉన్నప్పటికీ ఆర్డర్లు పుంజుకోవడం వల్లనే లాభాల్లో రెండంకెల వృద్ధి నమోదైందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.63, 678.92 కోట్ల నుంచి రూ.67,941.74 కోట్లకు ఎగబాకింది.