T20 World Cup : పొట్టి ప్రపంచకప్ నాకౌట్ దశలో వరుసగా రెండు ఓటములతో ఆతిథ్య శ్రీలంక టోర్నీ నుంచి నిష్క్రమించగా.. భారత జట్టు సైతం ఆ ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల ఓటమితో సెమస్ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది టీమిండియా. గ్రూప్ ‘ఏ’లో మూడో స్థానంలో నిలిచిన సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)సేన ముందడుగు వేయాలంటో అద్భుతం చేయాల్సిందే. తదుపరి రెండు మ్యాచుల్లో విజయం ఒక్కటే సరిపోదు. ఏదో గెలిచాం అన్నట్టుగా కాకుండా సంచలన విజయంతో ఆఫ్రికా జట్టుకు చెక్ పెట్టి రన్‌రేటు మెరుగుపరచుకోవాలి. ఇదంతా సాధ్యమవ్వాలంటే.. క్రీజునంటుకొని.. విధ్వంసక ఆటతో జట్టును ఆదుకునే ఒకరిద్దరు వీరులు అవసరం అనివార్యం.
ధనాధన్ క్రికెట్‌కు కేరాఫైన టీ20 ఫార్మాట్లో గొప్పగా ఆడిన జట్టుదే విజయం. ముఖ్యంగా.. టాపార్డర్ కుప్పకూలినప్పుడు.. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఒకరిద్దరు నిలబడితే చాలు స్కోర్ అదే వస్తుంది. ప్రత్యర్ధి బౌలర్లను కాచుకొని.. కీలక భాగస్వామ్యాలు నెలకొల్పితే చాలు మ్యాచ్‌ను కాపాడుకోవచ్చు. పొట్టి ప్రపంచకప్‌లో కీలకమైన సూపర్ 8లో న్యూజిలాండ్, వెస్టిండీస్ ఆటగాళ్లు అదే చేసి చూపించారు.
Two remarkable fightbacks in two days 🤯 pic.twitter.com/fEqMmCIDfC
— ESPNcricinfo (@ESPNcricinfo) February 26, 2026
బుధవారం ప్రేమదాస స్టేడియంలో శ్రీలంక బౌలర్ల ధాటికి కివీస్ టాపార్డర్ కుప్పకూలింది. చమీర(3-38), థీక్షణ(3-30)లు చెలరేగడంతో 84కే 6 వికెట్లు కోల్పోయింది. మరో వికెట్ పడి ఉంటే ఆ జట్టు కథ ముగిసేది. కానీ, కెప్టెన్ మిచెల్ శాంట్నర్(47), కొలే మెక్కొన్చీ(31 నాటౌట్) సంయమనంతో ఆడారు. కాస్త కుదురుకున్నాక బ్యాట్‌కు పని చెప్పారిద్దరూ.
లంక బౌలర్లను ఆశ్చర్యానికి గురి చేస్తూ డెత్ ఓవర్లలో సిక్స్‌లు, ఫోర్లతో శాంట్నర్ విరుచుకుపడ్డాడు. ఏడో వికెట్‌కు ఈ ద్వయం జోడించిన 84 రన్స్ కివీస్ ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. అనంతరం 169 ఛేదనలో తొలి బంతికే పథుమ్ నిశాంక(0)ను హెన్రీ బౌల్డ్ చేసి బ్రేకిచ్చాడు.. రచిన్ రవీంద్ర(4-27) తిప్పేయడంతో 61 పరుగులతో గెలుపొందిన బ్లాక్ క్యాప్స్.. శ్రీలంకను ఇంటికి పంపింది.
McConchie 🤝 Santner
Breaking @t20worldcup records and posting New Zealand’s highest partnership for the 7th wicket.
📷 = ICC/Getty #T20WorldCup #SLvNZ pic.twitter.com/fvx9kX4gPu
— BLACKCAPS (@BLACKCAPS) February 26, 2026
తొలి పోరులో జింబాబ్వేపై 107 పరుగులతో గెలుపొందిన వెస్టిండీస్.. రెండో మ్యాచ్‌లో ఆపద్భాదంవుల మెరుపులతో కోలుకుంది. గురువారం నరేంద్రమోడీ స్టేడియంలో పవర్ ప్లేలోనే నాలుగు వికెట్లు కోల్పోయిన విండీస్.. పదో ఓవర్లకే ఆలౌట్ ప్రమాదంలో పడింది. కగిసో రబడ(2-22), లుంగి ఎంగడి(3-30)ల ధాటికి 83 పరుగులకే 7 వికెట్లు పడ్డాయి. కరీబియన్ జట్టు 120-130లోపే పరిరమితం అవుతుందనిపించింది.
The highest 8th wicket partnership in T20Is from the duo in the first innings.💥👏🏾#T20WorldCup #MaroonSpirit #WIvSA pic.twitter.com/TW5EscC5F0
— Windies Cricket (@windiescricket) February 26, 2026
కానీ, రొమారియో షెపర్డ్(52 నాటౌట్), జేసన్ హోల్డర్(49)ల విధ్వంసం సృష్టించారు. భారీ షాట్లతో విరుచుకుపడిన ఈ ఇద్దరూ ఒకర్కు సిక్స్, బౌండరీ చొప్పన సాధిస్తూ.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఫలితంగా.. 83-7తో ఉన్న విండీస్ 176తో దక్షిణాఫ్రికాకు సవాల్ విసిరింది. కానీ, భారత జట్టు మాత్రం ఆపద్భాందుడిలా జట్టును నిలబెట్టే ఆటగాళ్లు లేక అవస్థలు పడుతోంది.
ప్రపంచకప్ లీగ్ దశ తొలి మ్యాచ్‌లోనే భారత్‌కు యూఎస్ఏ షాకిచ్చేలా కనిపించింది. పవర్ ప్లేలోనే నాలుగు బిగ్ వికెట్లు పడిన వేళ.. సూర్యకుమార్ యాదవ్(84) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. ఆ మ్యాచ్‌లో సూర్య గనుక నిలబడకుంటే ఘోర ఓటమి ఎదరయ్యేది. చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌పై ఓపెనర్ అభిషేక్ శర్మ డౌకటవ్వగా.. ఓపెనర్ ఇషాన్ కిషన్(77) తుఫాన్‌లా చెలరేగాడు. అర్ధ శతకంతో గట్టి పునాది వేసిన ఇషాన్ ఔటయ్యాక.. మిగతా వారంతా ఇలా వచ్చి అలా వెళ్లారు. ఫలితంగా భారీ స్కోర్ కొట్టాల్సిన టీమిండియా 175కే పరిమితమైంది. నెదర్లాండ్స్, నమీబియాపై కూడా భారత ఆటగాళ్లు గొప్పగా రాణించలేదు. సమిష్టితత్వం కొరవడడం ఎంత నష్టం చేస్తుందో.. నాకౌట్ తొలి మ్యాచ్‌లో భారత్‌కు అనుభవంలోకి వచ్చింది.
Suryakumar Yadav vs USA, 2026 pic.twitter.com/mDCbmvDkx2
— ESPNcricinfo (@ESPNcricinfo) February 10, 2026
దక్షిణాఫ్రికాను ఆరంభంలో కట్టడి చేసినా.. డేవిడ్ మిల్లర్(63), డెవాల్స్ బ్రెవిస్(45) సంచలన ఇన్నింగ్స్‌తో సఫారీ జట్టును ఆదుకున్నారు. అనంతరం భారీ ఛేదనలో మార్కో యాన్సెన్(4-22) ధాటికి.. టాపార్డర్ కప్పకూలింది. ఆదశలో ఓపికగా.. ఆడుతూ చెత్త బంతుల్ని శిక్షించాల్సిన పని ఎవరూ చేయలేదు. మూడో స్థానంలో తిలక్ వర్మ సమయోచితంగా ఆడాల్సింది పోయి వికెట్ ఇచ్చేశాడు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలు విఫలమవ్వగా.. ఐపీఎల్లో ఐదు సిక్సర్లతో జట్టులోకి వచ్చిన రింకూ సింగ్(0) సైతం నిరాశపరిచాడు.
అందరూ చేతులెత్తేసినా.. శివం దూబే(42) ఒంటరి పోరాటం చేయడంతో.. 76 పరుగుల ఓటమి ఎదురైంది. ఇంకేముంది ఫేవరెట్ టీమిండియా కాస్త.. సెమీస్ బెర్తుకు దూరంలో నిలిచింది. జింబాబ్వే, వెస్టిండీస్‌పై భారీ తేడాతో గెలిస్తేనే ముందంజ వేసే పరిస్థితి ఏర్పడింది. ఈ రెండు మ్యాచుల్లోనైనా.. క్రీజులో పాతుకుపోయి భాగస్వామ్యాలు నెలకొల్పితేనే సూర్యకుమార్ సేన సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోకుంటే.. శ్రీలంక తరహాలోనే ఆతిథ్య భారత్ కూడా టోర్నీ నుంచి నిష్క్రమించినా ఆశ్చర్యమేమీ లేదు.