హనుమకొండ, అక్టోబర్ 1 : ఈనెల 4 నుంచి 7 వరకు కర్ణాటక రాష్ర్టంలోని బెల్గావిలోని రాణి చెన్నమ్మ విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ (పురుషుల) టోర్నమెంట్ కోసం కాకతీయ విశ్వవిద్యాలయ కబడ్డీ జట్టును ఎంపిక చేసినట్లు విశ్వవిద్యాలయ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ప్రొఫెసర్ వై.వెంకయ్య తెలిపారు.
ఈ జట్టులో ఎంపికైన క్రీడాకారులు విశ్వవిద్యాలయ వ్యాయామ కళాశాల నుంచి జి.నాగరాజు, ఆర్. సోమేశ్వర్, జి. రమేష్, జి. గోపి; విశ్వవిద్యాలయ క్యాంపస్ కాలేజీ నుండి వి. కృష్ణ కుమార్ హనంకొండ యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్‌కాలేజీ నుంచి పి.ప్రణయ, హనుమకొండ కాకతీయ డిగ్రీ కాలేజీ నుంచి బి.సుమన్, కె.బన్నీ, బొల్లికుంట వాగ్దేవి వ్యాయామ కళాశాల నుంచి సీహెచ్.శివాజీ, హనుమకొండ వాగ్దేవి డిగ్రీ కాలేజీ నుంచి బి.రేవంత్, యు.శ్రవణ్, ఖమ్మం ఎస్.ఆర్. అండ్ బి.జి.ఎన్.ఆర్. కాలేజీ నుంచి బి.ఆజాద్, బి.కౌశిక్, జనగామ ఎ.బి.వి. డిగ్రీ కాలేజీ నుంచి సీహెచ్.రాము, ఈ జట్టుకు కోచ్‌గా డాక్టర్ ఎస్.కుమారస్వామి, విశ్వవిద్యాలయ వ్యాయామ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ మేనేజర్‌గా పీ.కిషన్, హనుమకొండ వాగ్దేవి డిగ్రీ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారన్నారు. వీరి ఎంపికను వైస్ చాన్సలర్ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వల్లూరి రామచంద్రం అభినందించారు.