హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లా దామగుండంలో ఫ్రీక్వెన్సీ రాడార్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం తీసుకున్న అటవీ భూమికి బదులుగా 9 లక్షల మొకలు నాటామని ప్రభుత్వం చెప్తున్న మా టలను ఎలా నమ్మాలని హైకోర్టు ప్రశ్నించింది.
కాగితాల్లో అన్నీ బాగానే ఉంటాయని వ్యాఖ్యానించింది. దీనిపై పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు సీజే జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేసింది.