బచ్చన్నపేట అక్టోబర్ 03 : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున జెడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేయనున్న అభ్యర్థుల నుంచి శుక్రవారం దరఖాస్తులు స్వీకరించారు. మండల ఎన్నికల ఇన్చార్జి బండ కింది హరిబాబు ఆధ్వర్యంలో మాజీ ఎంపిటిసి మండల నాయకులు ఎండీ మసూద్ పర్యవేక్షణలో స్థానిక ఆర్ అండ్ బి అతిథిగృహంలో దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకు మండలంలో జనరల్ స్థానానికి రిజర్వ్ అయిన జెడ్పిటిసి స్థానానికి ఎవరెవరు పోటీ చేయాలనుకున్నారో వారు దరఖాస్తు చేసుకుంటే, వాటిని అధిష్ఠానానికి పంపిస్తామన్నారు.
అభ్యర్థుల ఎంపిక నిర్ణయం పార్టీ తీసుకుంటుందన్నారు. దాదాపు పది మందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్లు వారు వివరించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు జంగిటి విద్యనాథ్, మండల నాయకులు నల్లగోని బాలకిషన్ గౌడ్,, పంచ వెంకట్ రెడ్డి, కోడూరు మహాత్మ చారి, గుర్రపు బాలరాజు, మాసాపేట రవీందర్ రెడ్డి, జిల్లా రాజయ్య,ఇజ్జ గిరి రాములు, ఎడ్ల మధుసూదన్ రెడ్డి, వీరన్న, జిల్లెల్ల దయాకర్ రెడ్డి, జిల్లా సందీప్, అంబాల ఆగయ్య, మల్లయ్య, దిడ్డిగా రమేష్, గిద్దెల రమేష్, కొండ హరికృష్ణ, చల్లా సురేందర్ రెడ్డి, భైరగొని కనకయ్య గౌడ్, ప్రకాష్, దత్రపు నరేష్ తదితరులు పాల్గొన్నారు.