నార్నూర్, అక్టోబర్03 : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో మండలంలోని నాగల్ కొండ గోండు గూడ గ్రామానికి చెందిన కే. లక్ష్మణ్ ఇల్లు కుప్పకూలడంతో ప్రమాదం తప్పింది.
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఈదురు గాలులతో ఇల్లు పై కప్పు ఒక్కసారిగా రేకులతో సహా కూలి పడిందని తెలిపారు. అప్రమత్తమై బయటికి రావడంతో ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. నిత్యావసర సరుకులు తడిసిపోయాయని ఆయన తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నారు.