గోల్నాక,అక్టోబర్ 1: మూసీ వరద బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బుధవారం అంబర్‌పేట అంబేద్కర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్పొరేటర్ విజయ్‌కుమార్‌గౌడ్, తాశీల్దార్ అన్వర్‌హుస్సేన్ తదితరులతో కలసి ఎమ్మెల్యే ఇటీవల మూసీ వరద బాధితులకు బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..మూసీ వరదతో తీవ్రంగా దెబ్బతిన్న మూసీ పరివాహక ప్రాంతాల్లో రహదారుల మరమ్మతులు చేపిస్తామన్నారు. అలాగే ఆస్తి నష్టం వివరాలను సేకరించి వారిని ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ భరోసా కల్సించారు. ఈ కార్యక్రమంలో అంబర్‌పేట సీఐ కిరణ్‌కుమార్, డిప్యూటీ తాశీల్దార్ బలరాం, బీఆర్ఎస్ నాయకులు భూపతి లక్ష్మణ్, సురేశ్‌గౌడ్, జనార్ధన్, రాము, ఆర్కే బాబు, పోత్నకు సంతోష్, వెంకట్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.