పురుగుల అన్నం మాకొద్దు..
‘పురుగుల అన్నం తినలేకపోతున్నాం.. భోజనం నాణ్యత లేకుండా వండుతున్నారు.. అడిగితే టార్గెట్ చేసి బూతులు తిడుతున్నారు. ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయా లి’.. అంటూ విద్యార్థినులు రోడ్డెక్కారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని ఎస్సీ గురుకుల స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు.
- రోడ్డెక్కిన గురుకుల విద్యార్థినులు
- శ్రీశైలం-హైదరాబాద్ హైవేపై నిరసన
- ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు
- బూతులు తిడుతున్న ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్
- సమస్యలు పరిష్కరిస్తామన్న అధికారులు
- అస్వస్థతకు గురైన నలుగురిని ప్రైవేట్ దవాఖాన తరలించిన సిబ్బంది
వెల్దండ, ఫిబ్రవరి 18 : ‘పురుగుల అన్నం తినలేకపోతున్నాం.. భోజనం నాణ్యత లేకుండా వండుతున్నారు.. అడిగితే టార్గెట్ చేసి బూతులు తిడుతున్నారు. ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయా లి’.. అంటూ విద్యార్థినులు రోడ్డెక్కారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని ఎస్సీ గురుకుల స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. హైదరాబాద్-శ్రీశైలం హైవేపై బైఠాయించారు. భోజనం నాణ్యతగా.. రుచిగా లేదని.. అన్నంలో పురుగులు వస్తున్నాయని ప్రిన్సిపాల్‌ను అడిగితే పురుగులు తీసేసి తినాలంటూ నిర్లక్ష్యంగా ఉచిత సలహా ఇస్తున్నాడని, ప్రశ్నించిన వారిని టార్గెట్ చేసి ఇష్టానుసారం దుర్భాషలాడుతున్నాడని ఆరోపించారు. పాఠశాలలో నిర్వహించే వివిధ కార్యక్రమాలకు సైతం అధికంగా డబ్బు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వాపోయారు. ప్రిన్సిపాల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ధర్నాతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకొన్న సర్పంచ్ యాదమ్మ, తాసీల్దార్ కార్తీక్‌కుమార్, ఎస్సై కురుమూర్తి, పోలీసులు అక్కడకు చేరుకొని విద్యార్థులకు నచ్చజెప్పే యత్నం చేశారు. అయినా వినకపోవడంతో సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించి ఆందోళన విరమించారు. అనంతరం పాఠశాలకు చేరుకొన్న విద్యార్థినుల్లో నలుగురికి కండ్లు తిరుగుతున్నాయంటే సిబ్బంది వెంటనే ప్రైవేటు దవాఖానకు తరలించారు. కార్యక్రమంలో వెల్దండ సింగిల్‌విండో డైరెక్టర్ వెంకటయ్యగౌడ్తోపాటు బీఆర్ఎస్ నాయకులు అశోక్, నిరంజ న్, విద్యార్థినులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

