హనుమకొండ, అక్టోబర్ 1: చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరస్వామి దేవాలయంలో రుద్రేశ్వరీదేవిని మహిశాసురమర్ధినిగా అలంకరించి కలువపూలతో అర్చించి, బెల్లంఅన్న, పులిహోరతో నివేదిన గావించి ఎరని అక్షింతలతో పూజించారు. యాగశాలలో గణపతి నవగ్రహ సుదర్శన మహాచండీయాగం సమాప్తంచేసి 21 రకాల ఫలపుష్పాలతో మహాపూర్ణాతి వేదపండితుల ఆధ్వర్యంలో మూలమత్రయుక్తంగా మహాపూర్ణాతి నిర్వర్తించినట్లు ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో శాసనమండలి వైస్ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ పాల్గొని పూజలు నిర్వహించారు.
అనంతరం హోమంలో పాల్గొన్నారు. అన్నప్రసాద వితరణ చేశారు. ఈ పూజా కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జస్టిస్ కందికొండ నర్సింహారావు దంపతులు, కేంద్ర పురావస్తుశాఖ తెలంగాణ రాష్ట్ర సూపరింటెండెంట్ నిఖిల్‌దాస్ దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. సాయంకాలం తిరునగరి శ్రవణ్‌కుమార్ ఆధ్వర్యంలో భక్తిగీతాలు ఆలపించారు. వైదిక కార్యక్రమాలను గదిమెళ్ల విజయకు మారాచార్యులు, గంగు ఉపేంద్రశర్మ, సందీప్‌శర్మలు నిర్వహించారు. ఈవో డి.అనిల్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పులి రజినీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.