Bhartha Mahasayulaku Wignyapthi | ఎట్టకేలకు ఓటీటీలోకి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bhartha Mahasayulaku Wignyapthi | మాస్ మహారాజా రవితేజ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' చిత్రం ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది
Raviteja New Movie OTT | మాస్ మహారాజా రవితేజ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకున్నప్పటికీ డిజిటల్ ప్రీమియర్ కోసం ప్రేక్షకులు భారీగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 (ZEE5) ఈ చిత్ర డిజిటల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. దీంతో ఈ వారం మార్చి 13 శుక్రవారం నుంచి ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ సరసన ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి కథానాయికలుగా నటించారు. సునీల్, సత్య, వెన్నెల కిషోర్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించగా, భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. థియేటర్లలో విడుదలైన దాదాపు 60 రోజుల తర్వాత ఓటీటీలోకి వస్తున్న ఈ చిత్రం, రవితేజ మార్క్ కామెడీ మరియు ఫ్యామిలీ సెంటిమెంట్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ వీకెండ్లో మంచి వినోదాన్ని అందిస్తుందని చెప్పవచ్చు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

