నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఫిబ్రవరి 18: తెలుగు రాష్ర్టాల్లోని పలు కోర్టుల్లో అగంతకుడి బాంబు మెయిల్ కలకలం రేపింది. బుధవారం ఉదయం 9:05 గంటలకు కరీంనగర్ కోర్టు వెబ్‌సైట్‌కు ‘సున్నియా దాసన్ ఔట్ లుక్ డాట్ కామ్’ పేరుతో ఓ మెయిల్ వచ్చిం ది. ‘మీ కోర్టులో 12 ఆర్డీఎక్స్ బాంబులు అమర్చారని, మధ్యాహ్నం 12:05 గంటలకు పేలుతాయని, ఇస్లామిక్ ప్రార్థనకు ముందు అందరూ న్యాయమూర్తుల భవనాలను ఖాళీ చేయండని’ అందులో పేర్కొన్నారు.
కోర్టు సిబ్బంది సమాచారంతో డాగ్, బాంబ్ స్వా డ్ సిబ్బంది కోర్టు భవన సముదాయంలో తనిఖీలు చేశారు. హైదరాబాద్‌లోని నాంపల్లి క్రిమినల్ కోర్టుల ప్రాంగణంలోని సీబీఐ కోర్టులో కోర్టు సిబ్బంది, న్యాయవాదులను కోర్టు హాల్లోనుంచి బయటికి పంపించిన పోలీసు అధికారులు మూడు గంటలపాటు బాంబ్, డాగ్‌స్క్వాడ్ ద్వారా క్షుణ్ణంగా పరిశీలించారు. ఎలాంటి ఆనవాళ్లు లభించకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.