Vijay Varma | కాస్టింగ్ కౌచ్‌పై విజయ్ వర్మ సంచలన వ్యాఖ్యలు.. నన్ను కూడా లైంగికంగా వేధించారు..
Vijay Varma | బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను బయటపెట్టి హాట్ టాపిక్‌గా మారారు. విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ వర్మ, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను కూడా కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపుల బారిన పడ్డానని వెల్లడించారు.
Vijay Varma | బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను బయటపెట్టి హాట్ టాపిక్‌గా మారారు. విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ వర్మ, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను కూడా కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపుల బారిన పడ్డానని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తెలుగు ప్రేక్షకులకు ‘మిడిల్ క్లాస్ అబ్బాయి (ఎంసీఏ)’ సినిమాలో విలన్ పాత్ర ద్వారా పరిచయమైన విజయ్ వర్మ, హిందీలో ‘గల్లీ బాయ్’, ‘డార్లింగ్స్’, ‘మట్కా కింగ్’ వంటి ప్రాజెక్ట్‌లతో నటుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. వ్యక్తిగత జీవితంలో హీరోయిన్ తమన్నా భాటియాతో రిలేషన్షిప్ కారణంగా కూడా తరచూ వార్తల్లో నిలిచిన ఆయన, ఇప్పుడు తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన అనుభవాల గురించి తొలిసారి బహిరంగంగా మాట్లాడారు.
మోడలింగ్ రంగంలో అవకాశాల కోసం హైదరాబాద్‌లో ప్రయత్నిస్తున్న సమయంలో ఓ మోడల్ కోఆర్డినేటర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని విజయ్ వర్మ తెలిపారు. ఆ వ్యక్తి తనను అనుచితంగా తాకేందుకు ప్రయత్నించడంతో పాటు అసౌకర్యానికి గురిచేసేలా ప్రవర్తించాడని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తాను వెంటనే స్పందించి, “బ్రో… ఏంటిది? ఏం చేస్తున్నావు?” అంటూ అతడిని ప్రశ్నించినట్లు చెప్పారు. ఆ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, కెరీర్ ప్రారంభంలో అలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం చాలా బాధ కలిగించిందని వెల్లడించారు. నటనలో అవకాశాల కోసం ప్రయత్నించే రోజుల్లో కేవలం తిరస్కరణలే కాకుండా ఇలాంటి ఇబ్బందులు కూడా ఎదురయ్యాయని విజయ్ వర్మ చెప్పారు. అయితే వాటి వల్ల నిరాశ చెందినా, నటనపై ఉన్న ప్రేమను మాత్రం వదులుకోలేదని తెలిపారు.
తన లక్ష్యంపై దృష్టి పెట్టి అన్ని అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు సాగానని, కష్టాలను పక్కనబెట్టి నటుడిగా తనను తాను నిరూపించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పారు. హైదరాబాద్‌లోని ఓ యాక్టింగ్ స్కూల్లో అడ్మిషన్ కోసం ప్రయత్నించినా అవకాశం రాలేదని విజయ్ వర్మ వెల్లడించారు. అనంతరం పుణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII) లో చేరేందుకు దరఖాస్తు చేశానని, మొదటి ప్రయత్నంలో విఫలమైనా రెండో ప్రయత్నంలో అడ్మిషన్ లభించిందని తెలిపారు.అక్కడ రాజ్‌కుమార్ రావు, జైదీప్ అహ్లావత్ వంటి నటులతో కలిసి శిక్షణ పొందినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

