నార్నూర్, అక్టోబర్ 03 : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, గాదిగూడ మండలాల్లో బహుజనులు 69వ ధమ్మ చక్ర పరివర్తన్ దివస్ను ఘనంగా నిర్వహించారు. దళిత వాడల్లో అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గౌతమ బుద్ధునికి ప్రత్యేక పూజలు చేశారు. పంచశీల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్పంచుల సంఘం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ గజానంద్ నాయక్ మాట్లాడుతూ… నేటి తరం యువత మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలన్నారు.
మహనీయుల సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని కోరారు.
ఉన్నత చదువులతో ప్రయోజకులు అయినప్పుడే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నార్నూర్ సహకార సంఘం చైర్మన్ ఆడే సురేష్, మాజీ జడ్పిటిసిలు హేమలతా బ్రిజ్జి లాల్, మాజీ ఎంపీటీసీ పరమేశ్వర్, జేఏసీ మాజీ చైర్మన్ రాథోడ్ ఉత్తమ్, మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షుడు లోకండే చంద్రశేఖర్, సహకార సంఘం డైరెక్టర్ దుర్గే కాంతారావ్, దళిత అవార్డు గ్రహీత, అన్నా బహుసాటే కమిటీ మండల అధ్యక్షుడు కోరల మహేందర్, ఆదివాసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పెందోర్ సంతోష్,నాయకులు లోకండే కేశవ్, దేవరావ్, రాథోడ్ సికిందర్, ప్రకాష్, భీం రావ్, మండాడి దౌలత్ రావు, గోవింద్, మనోహర్ తదితరులు ఉన్నారు.