నార్నూర్, అక్టోబర్3 : ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక భావాలను అలవర్చుకోవాలని ఆదిలాబాద్ జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ గ్రామంలో దుర్గా మాతకు దంపతులతో కలిసి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నియమ నిష్ఠతలతో జరుపుకోవడం హర్షనీయమన్నారు.
ఆధ్యాత్మికతతో మనస్సుకు ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు రాథోడ్ విష్ణు, రాథోడ్ రాజు నాయక్, మాజీ ఎంపీటీసీ జాదవ్ అరుణ దిలీప్, ఆయా శాఖల అధికారులు, గ్రామ పెద్దలు, యువకులు ఉన్నారు.