తుంగతుర్తి, మార్చి 02 : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు అభివృద్ధిని మరిచి బీఆర్ఎస్ ఫ్లెక్సీలు తీయడం సరికాదని ఆ పార్టీ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రైతు భరోసా ఇస్తామని వాయిదాల భరోసాలు చేస్తుండడంపై ప్రభుత్వాన్ని విమర్శించారు. నియోజకవర్గ కేంద్రంలో అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారాయన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గిరిజనుల ఆత్మ గౌరవ ప్రతీక అయిన సేవాలాల్ భవన్ నిర్మించాలనే ఉద్దేశ్యంతో రూ.2 కోట్లు కేటాయిస్తే ఎమ్మెల్యే, రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వెంటనే భవన నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుండగాని రాములు గౌడ్ , గోపగాని రమేశ్, భాస్కర్, రాములు పాల్గొన్నారు.