నాగర్ కర్నూలు : సినీ హీరో విజయ్ దేవరకొండ( Vijay ) , హీరోయిన్ రష్మిక మందాన (Rashmika ) నూతన దంపతులకు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్( Badavath Santosh ) దంపతులు కలిసి అభినందించారు. బల్మూరు మండలం తుమ్మన్ పెట్ గ్రామంలో సోమవారం నిర్వహించిన సత్యనారాయణ వ్రతంలో నూతన దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దంపతులు జ్ఞాపికను అందజేసి అభినందనలు తెలిపారు.
తమ అభిమాన నటులు సొంత ఊరిలో ఇంత సాదాసీదాగా, సంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకోవడం చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామంలోని వీధులన్నీ జనంతో కళకళలాడాయి.స్టార్ కపుల్ రాక నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. వారి నివాసం వద్ద ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.
ముందస్తు పాసులు ఉన్న వారినే లోపలికి అనుమతిస్తున్నారు. అచ్చంపేట డీఎస్పీ పల్లె శ్రీనివాస్ నేతృత్వంలో సీఐ నాగరాజు, బల్మూరు ఎస్సై రాజేందర్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.