ఇంద్రవెల్లి : ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ( Ambedkar ) ను ఆదర్శంగా తీసుకొని ప్రతి విద్యార్థి ఉన్నతంగా చదవాలని హైమన్ డార్ప్ బెట్టి ఏలిజీబెత్ స్మారక గ్రంథాలయం వ్యవస్థాపకులు దుర్వ సంతోష్ పేర్కొన్నారు.
సోమవారం ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ గ్రామం జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లను ఏంఈవో మణుకుమార్, ఉప సర్పంచ్ రాహుల్ బోస్లే చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కష్టాన్ని నమ్ముకొని అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు. పట్టుదల కృషి ఉంటే అనుకున్నది సాధించగలమని తెలిపారు.ప్రణాళిక ప్రకారం చదువుకొని పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతను సాధించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంఈవో మనుకుమార్, ఎంపీపీఎస్ పాఠశాల హెచ్ఎం రవీందర్, రంగుల రాజు సాయి గౌడ్ రమేష్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.