ఇంటర్ పరీక్ష రాసేందుకు వెళ్తున్న ఇద్దరు విద్యార్థులు.. స్కూల్ బస్సు ఢీకొని మృతి
నల్లగొండలో సోమవారం హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. నల్లగొండ మండలం చందనపల్లి గ్రామంలో ప్రైవేట్ స్కూల్ బస్సు నిర్లక్ష్యానికి ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. ఇంటర్మీడియట్ పరీక్ష రాసేందుకు..
నీలగిరి, మార్చి 02 : నల్లగొండలో సోమవారం హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. నల్లగొండ మండలం చందనపల్లి గ్రామంలో ప్రైవేట్ స్కూల్ బస్సు నిర్లక్ష్యానికి ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. ఇంటర్మీడియట్ పరీక్ష రాసేందుకు శాలిగౌరారం మండలం బండమీదిగూడెం గ్రామానికి చెందిన గైగుల్ల వంశీ (20), ఉట్కూర్ గ్రామానికి చెందిన గుడిసె రవి (20) బైక్పై నల్లగొండకు బయల్దేరారు. చందనపల్లి వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన ఎస్పీఆర్ స్కూల్కు చెందిన బస్సు అకస్మాత్తుగా యూ-టర్న్ తీసుకుని విద్యార్థులు ప్రయాణిస్తున్న బైక్ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు తీవ్ర గాయాలతో సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. వంశీ తండ్రి లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు నల్లగొండ రూరల్ ఎస్ఐ సైదా బాబు తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

