జన్నారం, ఆగస్టు 2 : మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్పెల్లిలోని వాగుకు చేపలు పట్టాడానికి వెళ్లిన ఐదుగురు ఆదివాసీ యువకులను ఫారెస్ట్ అధికారులు కొట్టితీసుకెళ్లడంపై గిరిజనులు ఆదివారం ఇందన్పెల్లి ప్రధానరోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. వారిని వదిలిపెట్టకపోవడంపై మండిపడ్డారు.
అటవీశాఖ అధికారుల దాడులతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి ఘటనలు జరుగకుండా ఉన్నతాధికారులు చర్యలు తీనుకోవాలని కోరారు.