ఫ్యూచర్ సిటీ / ఆమనగల్లు : దేవాలయాల్లో చోరీలకు ( Theft Case) పాల్పడుతున్న నిందితుడిని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ఆమనగల్లు పోలీసులు అరెస్ట్ ( Arrest ) చేసి, అతని వద్ద నుంచి సుమారు రూ.1.65 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. విట్టాయిపల్లి గ్రామ సమీపంలోని హనుమాన్, పెద్దమ్మ దేవాలయాల్లో జరిగిన చోరీలపై కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్ విభాగం సహకారంతో దర్యాప్తు చేపట్టారు.
నాగర్‌కర్నూల్ జిల్లా గంటరావుపల్లి గ్రామానికి చెందిన పెద్దముక్కల ఈశ్వర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో పెద్దకొత్తపల్లి, పానగల్లు, గంటరావుపల్లి, కందుకూరు ప్రాంతాల్లో జరిగిన ఇతర దేవాలయ చోరీల్లో కూడా అతని ప్రమేయం ఉన్నట్లు వెల్లడయ్యిందని తెలిపారు. నిందితుడి వద్ద నుంచి వెండి వస్తువులు, ఇత్తడి దీపాలు, గంటలు, రాగి పాత్రలు, బంగారు పూత వస్తువు, మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.