విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధానపాత్రలు పోషిస్తున్న రా అండ్ రస్టిక్ చిత్రం ‘అనకాపల్లి’. ఖగేష్ తమ్మినేని దర్శకుడు. కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మాతలు. దర్శక,నిర్మాత త్రినాథరావు నక్కిన ఇందులో ఓ ముఖ్య పాత్ర కూడా పోషిస్తుండటం విశేషం. ఈ నెల 7న సినిమా విడుదల కానున్నది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి ఓ మాస్ గీతాన్ని మేకర్స్ విడుదల చేశారు.
‘డర్టీ గ్యాంగ్ స్టర్స్..’ అంటూ సాగే ఈపాటను ప్రముఖ నటుడు సోనూసూద్ విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. కేకే రాసిన ఈ పాటను, దేవ్‌జండ్ స్వరపరచగా, పృథ్వీ చంద్ర, ఈకే కలిసి ఆలపించారు. మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా ఈ పాట సాగింది. ఈ చిత్రానికి కెమెరా: మాయా.వి, కథ, కథనం: నక్కిన త్రినాథరావు, నిర్మాణం: భవ్యశ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్.