బిల్లులు చెల్లించాలని పాఠశాల భవనానికి తాళం
మన ఊరు - మన బడి పథకం కింద చేపట్టిన పాఠశాలల అదనపు భవనాలకు గత కొన్నేళ్లుగా పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో విసుగి వేసారిన కాంట్రాక్టర్ పాఠశాల అదనపు భవనానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేసిన ఘటన మండలంలోని చిన్నతాండ్రపాడు గ్రామం లో చోటు చేసుకొన్నది. మండలంలోని చిన్నతాండ్రపాడు గ్రామం లోని జెడ్పీహెచ్ఎస్లో అదనపు భవన నిర్మాణానికి బీఆర్ఎస్ హయాంలో రూ. 9 లక్షలు మంజూరు చేసింది.
- నాలుగేళ్లుగా కాలయాపన
- గత్యంతరంలేక నిరసన తెలిపానని కాంట్రాక్టర్ రమేశ్ ఆవేదన
- పనుల పెండింగ్‌తోనే బిల్లులు ఆలస్యం : పీఆర్ డీఈ
అయిజ, ఫిబ్రవరి 18 : మన ఊరు – మన బడి పథకం కింద చేపట్టిన పాఠశాలల అదనపు భవనాలకు గత కొన్నేళ్లుగా పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో విసుగి వేసారిన కాంట్రాక్టర్ పాఠశాల అదనపు భవనానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేసిన ఘటన మండలంలోని చిన్నతాండ్రపాడు గ్రామం లో చోటు చేసుకొన్నది. మండలంలోని చిన్నతాండ్రపాడు గ్రామం లోని జెడ్పీహెచ్ఎస్లో అదనపు భవన నిర్మాణానికి బీఆర్ఎస్ హయాంలో రూ. 9 లక్షలు మంజూరు చేసింది. పనులు దక్కించుకొన్న కాంట్రాక్టర్ పనులు కొంత వరకు పూర్తి చేయగా ప్రభుత్వం రూ.7.50 లక్షలు చెల్లించిందని, మరో రూ.1.50 లక్షలు పెండింగ్ పెట్టడంతో బుధవారం పాఠశాలకు చేరుకొని అదనపు భవనం దగ్గర నిరసన తెలిపారు.
నాలుగేళ్లుగా పెండింగ్ బిల్లులు చెల్లించాలని పంచాయతీరాజ్ అధికారులకు మొరపెట్టుకున్నా స్పందించడం లేదని కాంట్రాక్టర్ రమేశ్ తెలిపారు. అయిజ మండలంలోని చిన్నతాండ్రపాడులో రూ.9 లక్షలు, ఈడిగోనిపల్లి పాఠశాలలలో 3 మరుగుదొడ్లు రూ.6 లక్షలు, అలంపూర్‌లోని బాలికల ఉన్నత పాఠశాలలో 3 అదనపు గదుల నిర్మాణాలను రూ.27లక్షలతో చేపట్టినా పూర్తిస్థాయిలో బిల్లులు విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చిన్నతాండ్రపాడులోని అదనపు భవనంలో ల్యాబ్ నిర్వహిస్తున్నారు. అప్పటికే తాళం వేసి ఉంచిన భవనం ఎదుట కాంట్రాక్టర్ నిరసన తెలిపారని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగలేదని పాఠశాల హెచ్ఎం హన్మంతు తెలిపారు.
ఈ విషయమై పంచాయతీ రాజ్ డీఈ వెంకట్‌రెడ్డి పాఠశాలకు చేరుకొని కాంట్రాక్టర్ బిల్లుల చెల్లింపు విషయమై విచారణ చేపట్టారు. పనులు పూర్తిస్థాయిలో చేపట్టకపోవడంతోనే గత నాలుగేళ్లుగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని డీఈ తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పనులు ఉపాధ్యాయులు నగదు జమ చేసుకొని పెండింగ్ పనులు పూర్తి చేసుకొని భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారని, పెండింగ్ పనులు చేపట్టకున్నా మొత్తం బిల్లులలో ఆలస్యమైందని, పనులు చేపట్టకున్నా బిల్లులు విడుదల చేయాలని కాంట్రాక్టర్ అదనపు భవనం దగ్గర నిరసన తెలిపారని పేర్కొన్నారు. దీనిపై సమగ్రమైన విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

