Vitamin D | మధుమేహం ఉన్నవారికి వరం విటమిన్ డి.. సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడి..
విటమిన్ డి శరీరానికి అత్యంత అవసరమైన పోషకాలలో ఒకటి. దీనిని సన్‌షైన్ విటమిన్ అని కూడా పిలుస్తారు. ఎముకల ఆరోగ్యంతోపాటు శరీరంలోని అనేక కీలక వ్యవస్థలు సక్రమంగా పనిచేయడానికి ఇది అవసరం.
Vitamin D | విటమిన్ డి శరీరానికి అత్యంత అవసరమైన పోషకాలలో ఒకటి. దీనిని సన్‌షైన్ విటమిన్ అని కూడా పిలుస్తారు. ఎముకల ఆరోగ్యంతోపాటు శరీరంలోని అనేక కీలక వ్యవస్థలు సక్రమంగా పనిచేయడానికి ఇది అవసరం. ఒక అధ్యయనం ప్రకారం విటమిన్ డి క్లోమగ్రంథి (ప్యాంక్రియాస్)లో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసి, నిల్వ చేసి, విడుదల చేసే బీటా కణాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. దీంతో మధుమేహం చికిత్సలో విటమిన్ డి పాత్రపై కొత్త ఆశలు కనిపిస్తున్నాయి. పరిశోధకుల ప్రకారం శరీరంలో విటమిన్ డి స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. విటమిన్ డి రిసెప్టర్‌ను చురుకుగా చేయడం ద్వారా శరీరంలోని వాపులను తగ్గించే జన్యువుల పనితీరు మెరుగుపడి, ఒత్తిడిలో కూడా బీటా కణాలు మనుగడ సాగించేందుకు తోడ్పడతాయని అధ్యయనం పేర్కొంది. అయితే కేవలం విటమిన్ డి ఒక్కటే బీటా కణాలను పూర్తిగా రక్షించలేదని కూడా పరిశోధకులు వెల్లడించారు.
సూర్యకాంతి తగలాలి..
శరీరంలో విటమిన్ డి లోపం రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ కొంతసేపు సూర్యరశ్మిలో గడపడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు కనీసం ఐదు నిమిషాలపాటు ఎండలో ఉండటం వల్ల చర్మంలో ఉండే కొలెస్ట్రాల్‌పై సూర్యుని అతినీలలోహిత కిరణాలు ప్రభావం చూపి విటమిన్ డిగా మారుతుంది. అలాగే వారానికి కనీసం మూడు రోజులైనా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య సూర్యరశ్మి శరీరానికి అందితే విటమిన్ డి స్థాయిలు పెరగడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. ఆహారంలో విటమిన్ డి సమృద్ధిగా ఉండే పదార్థాలను చేర్చుకోవడం కూడా అవసరం. ముఖ్యంగా పుట్టగొడుగులు, గుడ్డు పచ్చసొన, కాడ్ లివర్ ఆయిల్, కొవ్వు ఎక్కువగా ఉండే చేపలు వంటి ఆహారాల్లో విటమిన్ డి లభిస్తుంది.
ఈ ఆహారాలను తీసుకుంటే..
సోయా పాలు, మజ్జిగ వంటి పానీయాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం కూడా విటమిన్ డి అందించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. అయితే ఇతర విటమిన్ డి ఫోర్టిఫైడ్ పానీయాలను తీసుకునే ముందు పోషకాహార నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. విటమిన్ డి లోపం ఉన్నట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయినప్పుడు మాత్రమే వైద్యుల పర్యవేక్షణలో విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. స్వయంగా మందులు వాడటం ఆరోగ్యానికి హానికరమవుతుందని హెచ్చరిస్తున్నారు. విటమిన్ డి ఎక్కువగా కాడ్ లివర్ ఫిష్ ఆయిల్, ఎండబెట్టిన షిటాకే పుట్టగొడుగులు, గుడ్లు, పూర్తి పాలతో తయారుచేసిన మజ్జిగ, చెడార్ లేదా పార్మెసన్ చీజ్ వంటి ఆహారాల్లో లభిస్తుంది. వీటిని తీసుకోవడం ద్వారా మనం తగినంత విటమిన్ డి ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhaskar Rao | సింగరేణి లాభాల తగ్గుదలపై సమగ్ర నివేదిక విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
పంచాయతీ అధికారి పర్సంటేజీల దందా ?
Weight Loss Surgery | కౌమారదశలో ఉన్న వారికి బరువు తగ్గించే శస్త్ర చికిత్సలు అవసరమా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది..?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

