వరంగల్ : వరంగల్ జిల్లా ఖానాపురం మండలానికి చెందిన భారతీయ జనతా పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ (రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు)గూగులోత్ లక్ష్మణ్ నాయక్ బీఆర్ఎస్లో చేరారు. ఆ పార్టీకి పార్టీకి రాజీనామా చేసి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగృహం నల్లబెల్లిలో విజయదశమి రోజున బీఆర్ఎస్ పార్టీలో చేరారు. లక్ష్మణ్ నాయక్‌కు గులాడీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మహాలక్ష్మి వెంకట నరసయ్య మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, క్లస్టర్ బాధ్యులు సదర్ లాల్, వల్లపు శ్రీనివాస్, బాలు నాయక్ తేజావత్ బాలు నాయక్, మాజీ సర్పంచ్ అశోక్, బాల కిషన్, వెంకన్న, కోరే సుధాకర్, కోరే రాము, మాజీ ఎంపిటిసి పూలు నాయక్, రెడ్యానాయక్, తదితరులు పాల్గొన్నారు.