నార్నూర్, అక్టోబర్ 3 : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, గాదిగూడ మండలాలలో విజయదశమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఆదివాసి గుడేలలో రైతులు వ్యవసాయ సామగ్రి లకు ప్రత్యేక పూజలు చేశారు. వాహనదా రులు తమ వాహనాలకు పూజలు నిర్వహించారు. అలాగే నార్నూర్ మండల కేంద్రంలోని శ్రీ ఖాందేవ్ ఆలయంలో తొడసం వంశీయుల ఆధ్వర్యంలో ఖాందేవ్ ప్రతిమలకు సాంప్రదాయ పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
దసరా వేడుకను పురస్కరించుకొని ఖాందేవ్ పుణ్యక్షేత్రంలో పూజలు నిర్వహించడం ఆనాదిగా వస్తున్న ఆచారమని ఆ వంశం పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ వైస్ మాజీ చైర్మన్ తోడసం నాగోరావ్, మాజీ ఎంపీపీ మెస్రం రూప్ దేవ్, రాజు పటేల్, మూతిరం పటేల్, భీంరావ్ పటేల్, అంబాజీ పటేల్, కాటోడ బాపురావు, తెలంగ్ రావు, యాదవ్ రావు, శంభు, ఆనంద్ రావు, రామారావు, భీం రావు తదితరులున్నారు.