Uber Driver | మహిళతో ఉబర్ డ్రైవర్ అసభ్య ప్రవర్తన.. అర్ధరాత్రి బైకుపై వెళ్తుండగా లైంగిక దాడికి యత్నం
Uber Driver : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. తన బైకుపై వెళ్తున్న ఒక మహిళతో ఉబర్ రైడర్ అసభ్యంగా ప్రవర్తించాడు. లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటన ఢిల్లీలోని పితాంపుర పరిధిలో, ఈ నెల 12న అర్ధరాత్రి 1.28 గంటల సమయంలో జరిగింది.
Uber Driver : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. తన బైకుపై వెళ్తున్న ఒక మహిళతో ఉబర్ రైడర్ అసభ్యంగా ప్రవర్తించాడు. లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటన ఢిల్లీలోని పితాంపుర పరిధిలో, ఈ నెల 12న అర్ధరాత్రి 1.28 గంటల సమయంలో జరిగింది. ఈ ఘటనకు పాల్పడిన ఉబర్ డ్రైవర్ అయిన నిందితుడిని సచిన్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత యువతి అర్ధరాత్రి సమయంలో ఢిల్లీలోని రోహిణి సెక్టార్-15 నుంచి ఎంబీ బ్లాక్ మార్కెట్ వరకు ఉబర్ రైడ్ బుక్ చేసుకుంది.
బైకుపై కూర్చున్న తర్వాత నుంచి రైడర్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. కావాలని తాకడం చేశాడు. ఆమె దీనిపై వార్నింగ్ ఇచ్చినప్పటికీ అతడు వినలేదు. ఇదే సమయంలో బైకును వేగంగా పోనిచ్చాడు. స్పీడ్ బ్రేకర్ల వద్ద కూడా వేగంగా రైడ్ చేశాడు. బైక్ నెమ్మదిగా పోనిమ్మని చెప్పినా వినలేదు. అంతేకాదు.. ఆమెను వెనుకు నుంచి పట్టుకుని లైంగికంగా వేధించే ప్రయత్నం చేశాడు. బైకు ఆపాలి అని చెప్పినా వినిపించుకోకుండా అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించాడు. ఈ విషయం ఎవరికైనా చెప్పినా, గట్టిగా అరిచినా చంపేస్తానని ఆమెను బెదిరించాడు. అంతేకాదు.. వెళ్లాల్సిన రూట్లో కాకుండా వేరే రూట్లో వెళ్లాడు.
దీంతో ఆమె భయాందోళనకు గురై ఏడ్వడం, గట్టిగా అరవడం మొదలుపెట్టింది. బైక్ ఆపకపోతే దూకేస్తానని హెచ్చరించింది. చివరకు ఎఫ్-యు బ్లాక్‌లోని సర్వోదయ విద్యాలయా వద్ద ఆమెను దించేసి వెళ్లిపోయాడు. అప్పటికే ఏడుస్తున్న ఆమెకు దగ్గర్లో ఉన్న సెక్యూరిటీ గార్డులు, ఇతర మహిళలు, స్కూల్ స్టాఫ్ సాయం చేశారు. వెంటనే బాధిత మహిళ ఉబర్‌లో ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది. అలాగే పోలీసులకు డయల్ చేసింది. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

